Astro News: కలలో కుక్క కనిపించిందా.. శుభమా.. అశుభమా తెలుసుకోండి

Astro News: మనం ప్రతిరోజు నిద్రించే సమయంలో ఎన్నో కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి. అయితే కలలు మనిషి నిజ జీవితంపై ప్రభావం చూపుతాయి.

Shekhar G
Updated on: 3 Feb 2024 8:30 PM IST
Find Out Whether A Dog Appeared In A Dream Is It Good Or Bad
X

Astro News: కలలో కుక్క కనిపించిందా.. శుభమా.. అశుభమా తెలుసుకోండి

Astro News: మనం ప్రతిరోజు నిద్రించే సమయంలో ఎన్నో కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి. అయితే కలలు మనిషి నిజ జీవితంపై ప్రభావం చూపుతాయి. కొన్ని కలలు శుభ సంకేతాలను ఇస్తే మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి. స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. ఒక్కోసారి మనం నిద్రపోయే ముందు ఏమనుకుంటున్నామో అది కలలో కనిపిస్తుంది. కలలో జంతువులు, పక్షులు కనిపించడం సహజమే. అయితే కలలో కుక్క కనిపిస్తే ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

కుక్కను చూడటం

కొంతమంది పెంపుడు జంతువులను కలలో చూస్తారు. కలలో కుక్క కనిపిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కుక్కను చూడటం శుభ సంకేతంగా భావిస్తారు. అయితే కుక్క ఏ స్థితిలో ఉందో అవసరం. ఉదాహరణకు కలలో నల్లకుక్కను చూస్తే అది శని గ్రహానికి సంబంధించినది. మీరు శని దేవుడిచే ఆశీర్వదించబడ్డారని అర్థం. ఇది కాకుండా మీరు స్నేహితుడిని కలవవచ్చని అర్థం. అయితే నల్ల కుక్క కోపంగా ఉంటే అది అశుభ సంకేతమని గుర్తించండి.

కలలో కుక్క మీ వైపు నడుస్తున్నట్లు కనిపిస్తే పాత స్నేహితుడిని కలుస్తున్నారని అర్థం. ఇది కాకుండా మీరు జీవితంలో చాలా ఒంటరిగా ఉంటారు మీకు భాగస్వామి కావాలని కూడా సూచిస్తుంది. అదే కలలో కోపంగా ఉన్న కుక్కను చూస్తే మీరు విశ్వసించే వ్యక్తి త్వరలో మీకు ద్రోహం చేయబోతున్నాడని అర్థం. ఆ వ్యక్తితో మీకు వివాదం జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు కలలో పిచ్చి కుక్క కనిపిస్తే ఏదో ఒక పనిలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలని అర్థం. పిల్లలకు కలలో పిచ్చి కుక్క కనిపిస్తే చదువుపై ఏకాగ్రత కోల్పోతారని గుర్తించండి.

Shekhar G

Shekhar G

Next Story