Telugu Horoscope Today 20 August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 20 August 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం.తిధి: పాడ్యమి రాత్రి గం.8.32 ని.ల వరకు ఆ తర్వాత విదియ. నక్షత్రం: శతభిషం అర్ధరాత్రి దాటాక గం.3.09 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర.

P Vijay Kumar Astrologer
Updated on: 20 Aug 2024 6:00 AM IST
Telugu Horoscope Today 20 August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా
X

రాశిఫలం 20-08-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం.

తిధి: పాడ్యమి రాత్రి గం.8.32 ని.ల వరకు ఆ తర్వాత విదియ.

నక్షత్రం: శతభిషం అర్ధరాత్రి దాటాక గం.3.09 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర.

అమృతఘడియలు: రాత్రి గం.8.44 ని.ల నుంచి గం.10.10 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.10 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.11 ని. ల నుంచి గం.11.57 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.3.29 ని.ల నుంచి గం.5.04 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.00 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 6.38 ని.లకు.

మేషం

కాలం ఆనందంగా సాగుతుంది. వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. విందులో పాల్గొంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

వృషభం

కార్యాలు సఫలం అవుతాయి. విధి నిర్వహణలో మీ నైపుణ్యానికి ప్రశంసలు అందుతాయి. అధికార వృద్ధి ఉంది. శత్రుపీడ తొలగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభీష్టం సిద్ధిస్తుంది. సుఖాన్ని పొందుతారు.

మిథునం

కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు చికాకు పెడతాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయులతోనే విరోధం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. ఆర్థికంగా చిక్కుల్లో పడతారు. చెడు దారులు తొక్కే వీలుంది. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. పోటీల్లో ఓటమి గోచరిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

సింహం

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. బ్యాంకు లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గృహావసరాలు తీరుస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కోరిక తీరుతుంది.

కన్య

మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆర్థికంగా లబ్ది చేకూరుతుంది. బలహీనతలను అధిగమిస్తారు. పోటీదారులపై విజయం సాధిస్తారు. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి.

తుల

సొంత తెలివితేటలు పనిచేయవు. అత్యవసర వేళల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. ధన సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. వృథా ఖర్చులు అదుపు చేయాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది.

వృశ్చికం

వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచన విధానం మారుతుంది. మనసు నిలకడగా ఉండదు. భూ సంబంధ వ్యవహారాలు బెడిసికొడతాయి. విద్యాసంస్థల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు

ఉల్లాసంగా గడుస్తుంది. పనులు నిర్దేశిత సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక చిక్కులు తొలగుతాయి. కుటుంబ వాతావరణం తృప్తినిస్తుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది.

మకరం

అనుకున్న పనులు సవ్యంగా సాగవు. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. కుటుంబంలోనూ చికాకులు ఉంటాయి. వేళకు భోజనం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కంటి సంబంధ సమస్యలుంటాయి.

కుంభం

అభీష్టం నెరవేరుతుంది. ధన లాభం ఉంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి చేరాలన్న ప్రయత్నం అనుకూలిస్తుంది. మానసిక, శారీరక సౌఖ్యాన్ని పొందుతారు.

మీనం

కార్యవైఫల్యం బాధిస్తుంది. బద్ధకం వల్ల చిక్కుల్లో పడతారు. దూర ప్రయాణం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఖర్చు పెరుగుతుంది. పాదాల సమస్య వేధిస్తుంది. అనవసర జోక్యాలు వద్దు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story