Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (4/1/2025)

Daily Horoscope Today In Telugu, January 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 4 Jan 2025 2:14 AM IST
Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (4/1/2025)
X

Daily Horoscope Today In Telugu, January 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి: పంచమి రాత్రి గం.10.00 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: శతభిషం రాత్రి గం.9.23 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.29 ని.ల నుంచి గం.4.01 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటిన తర్వాత తె.వా. గం.3.30 ని.ల నుంచి గం.5.01 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.47 ని.ల నుంచి గం.8.16 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.34 ని.ల నుంచి గం. 10.58 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.47 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.5.55 ని.లకు

మేషం

పనులు విజయవంతం అవుతాయి. అవసరమైన వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. విందుకు హాజరవుతారు. బంధాలు బలపడతాయి.

వృషభం

అన్ని కార్యాలూ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో లబ్దిని పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థానానికి ఎదిగే ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

మిథునం :

సంప్రదాయిక జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పరిహారం చెల్లించే సూచన ఉంది. వృథా ప్రయాణం వద్దు.

కర్కాటకం:

మీ బలహీనతలే ఆధారంగా శత్రువులు దెబ్బతీస్తారు. అప్రమత్తంగా ఉండండి. ఇష్టంలేని చోట కార్యాలను సాధించుకు రావాల్సి వస్తుంది. పనులు అనుకున్నట్లుగా సాగవు. ఉద్రేకాన్ని తగ్గించుకోండి. పోటీలకు దిగకండి.

సింహం :

స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. సంతాన వ్యవహారాలు తృప్తిన్నిస్తాయి. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది.

కన్య :

సమయోచిత నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వివాద పరిష్కార ప్రయత్నం ఫలిస్తుంది. అదృష్టం వరిస్తుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు.

తుల :

ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ దశలో భయం ఆవహిస్తుంది. స్థిర చిత్తంతో వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతానం తీరు ఇబ్బంది పెడుతుంది. అనవసర జోక్యం చేసుకోకండి. వృథా ఖర్చు తగ్గించండి.

వృశ్చికం :

మీవంటి మనస్తత్వం కల వారిని కలుస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. బుద్ధి నిలకడగా ఉండదు. పనుల్లో ఒత్తిళ్ల వల్ల ఉద్రేకానికి గురవుతారు. అనవసరంగా గొడవలకు దిగకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

ధనుస్సు :

వృత్తిపర నైపుణ్యంతో అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. సోదరులు సహకరిస్తారు.

మకరం :

ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడే సూచన ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో ఉండవు. విలువైన వస్తువులు భద్రం.

కుంభం :

సామాజిక అంశాలపై అవగాహనను పెంచుకుంటారు. జీవితంలో ఎదిగేందుకు మేలిమి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారం ఆనందాన్నిస్తుంది. వ్యక్తిత్వానికి తగ్గ గకపుచగ లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది.

మీనం :

పనులు అనుకున్నట్లు సాగవు. అనూహ్యమైన ఖర్చులు వస్తాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. కొర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. మనసు దిగులుగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

శుభమస్తు

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story