Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (29/1/2025)

Daily Horoscope Today In Telugu, January 29, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 12 May 2025 1:10 PM IST
Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (29/1/2025)
X

Daily Horoscope Today In Telugu, January 29, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.


మేషం

అన్నింటా అనుకూల ఫలితాలే ఉంటాయి. అధికార వృద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మనోవాంఛ నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృషభం

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అవసరమైన మేర డబ్బు సర్దుబాటు అవుతుంది. తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను, గురువులను కలుస్తారు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

మిథునం

వారసత్వపు ఆస్తి వ్యవహారాలు లాభించవు. అనవసర పంతాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇష్టంలేని పనిని చేయాల్సి వస్తుంది. కోపాన్ని అణచుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పైత్య సమస్య ఉంటుంది.

కర్కాటకం

కొత్త బంధాలు ఏర్పడాయి. స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. నిజాయితీకి గుర్తింపు ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. బంధువులను కలుస్తారు.

సింహం

కార్యాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి. మిత్రులు తోడుగా ఉంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య

ఒడుదుడుకులు ఎదురైనా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. కీలక సమయంలో మీ తెలివితేటలు ఉపకరించవు. ధన సంబంధ వ్యవహారం నిరాశ పరుస్తుంది. ధైర్యం కోల్పోకండి.

తుల

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర జోక్యాల వల్ల అవమానానికి గురవుతారు. ఆలోచన విధానాన్ని మార్చుకోండి.

వృశ్చికం

వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆదాయం బావుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సోదరులు తోడుంటారు. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. అకారణ విరోధాలకు ఆస్కారముంది. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వేళకు భోజనం ఉండదు. కంటి సమస్య ఉంటుంది.

మకరం

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనయోగం ఉంది. విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బాల్య మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కుంభం

పనులు ఆశించిన రీతిలో సాగవు. దిగులు కలుగుతుంది. అనూహ్య ఖర్చులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అసూయను వీడండి. సహచరులతో సఖ్యతను పెంచుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త.

మీనం

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణం వినోదంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతానం తీరు సంతృప్తినిస్తుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బావుంటుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story