Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (5/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (5/2/2025)

Highlights

Daily Horoscope Today In Telugu, February 5, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 5, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ధనలాభం ఉంది. కీలక సందర్భంలో అదృష్టం తోడుంటుంది. జీవితంలో ఎదిగేందుకు అవకాశం వస్తుంది. ఉపయోగించుకోండి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.

వృషభం

వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుపీడ చికాకును కలిగిస్తుంది. అవసరమైన సమయంలో మిత్రులు అందుబాటులో ఉండరు. వృథా ఖర్చు తగ్గించండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ప్రయాణం లాభించదు.

మిథునం

కార్యజయం ఉంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా లబ్దిని పొందుతారు. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆత్మీయుల నుంచి అవసరమైన సాయం లభిస్తుంది.

కర్కాటకం

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. వృత్తిపరమైన నైపుణ్యానికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు.

సింహం

విధి నిర్వహణలో అలక్ష్యం వల్ల ఇబ్బంది వస్తుంది. బద్ధకాన్ని వదిలి పెట్టండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. గురు సమానులను కలుస్తారు. న్యాయపరమైన వివాదాల్లో నిర్లక్ష్యం వద్దు. దూర ప్రయాణం ఉంది.

కన్య

పోటీలు లాభించవు. ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచండి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినివ్వవు. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ఇష్టంలేని పనిని చేయక తప్పదు. చెప్పుడు మాటలను విశ్వసించకండి.

తుల

బంధాలు బలపడతాయి. అంతరంగం ఆనందంగా ఉంటుంది. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.

వృశ్చికం

అపార్థాలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. బంధువులు, మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు

తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభించదు. విచారం ఆవరిస్తుంది. అధైర్యపడకుండా కష్టపడండి. నీచపు ఆలోచన మంచిది కాదు. వృథా ఖర్చు తగ్గించండి. విలువైన వస్తువు లేదా డాక్యుమెంట్ దొంగతనమయ్యే సూచనుంది.

మకరం

కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. డబ్బుకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత రహస్యాలు జాగ్రత్త. సహచరుల కదలికలపై దృష్టి పెట్టండి. వాహన సంబంధ ఇబ్బంది గోచరిస్తోంది.

కుంభం

వ్యవహారాల్లో విశేషంగా లాభపడతారు. సాహసోపేత నిర్ణయానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. సహచరులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కీలక సమాచారం అందుతుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది.

మీనం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక లావాదేవీలు లాభించవు. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు. మానసిక అశాంతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిజాయితీని వదలకండి.

Read Today's Latest Horoscope News in Telugu and Telugu News

Show Full Article
Print Article
Next Story
More Stories