Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (3/2/2025)

Daily Horoscope Today In Telugu, February 3, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 3 Feb 2025 12:15 AM IST
Daily Horoscope Today
X

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (3/2/2025)

Daily Horoscope Today In Telugu, February 3, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

మేషం

వ్యతిరేక ఫలితాల వల్ల మనసు కాస్త దిగులుగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయం వల్ల డబ్బు కోల్పోతారు. ఇతరుల విషయాల్లో జాగ్రత్త. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది.

వృషభం

శుభకార్యాచరణ గురించి యోచిస్తారు. సంతాన సంబంధ వినోద సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. కొత్త స్నేహాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విందులో పాల్గొంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దలను కలుస్తారు.

మిథునం

మనోవాంఛ సిద్ధిస్తుంది. సమర్థతకు తగ్గ లాభం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధీ గోచరిస్తోంది. ఉద్యోగులకు రివార్డులు దక్కుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఇతరులతో విరోధంలో మీదే పైచేయి అవుతుంది.

కర్కాటకం

బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. నిజాయితీని వదులుకోకండి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. సంతానంతో విభేదిస్తారు. ఓవ్యవహారంలో పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

సింహం

నిర్దేశిత రీతిలో పనులు సాగవు. పోటీల్లో పరాజయం తప్పదు. ధననష్టం ఉంది. చెప్పుడు మాటలను నమ్మకండి. చెడు ఆలోచనలను నియంత్రించండి. కోపం తగ్గించుకోండి. పైత్య సంబంధ సమస్య ఉంటుంది.

కన్య

కొత్త కార్యాలు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లబ్ది ఉంటుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విజ్ఞానం పొందేందుకు అనువైన కాలమిది.

తుల

న్యాయవివాదాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోయిన వస్తువు తిరిగి దొరికే సూచన ఉంది.

వృశ్చికం

ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు. అభీష్టం నెరవేరదు. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు భద్రంగా దాచుకోండి. వాత సంబంధ ఇబ్బంది వుంటుంది.

ధనుస్సు

పనులు అనుకున్నట్లుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అనూహ్యంగా వచ్చే వృథా ఖర్చులను తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. తల్లివైపు బంధువుల సమాచారం అందుతుంది. మనశ్శాంతి వుండదు.

మకరం

ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అన్ని వేళలా మిత్రులు అండగా ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయం లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇరుగుపొరుగుతో సంబంధాలు పెరుగుతాయి.

కుంభం

బ్యాంకు లావాదేవీలు చికాకు పెడతాయి. ఇతరుల కారణంగా ఇబ్బంది పడతారు. నిందలు ఎదురవుతాయి. వేళకు భోజనముండదు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. నిజాయితీని విడవకండి. తగాదాలకు దూరంగా ఉండండి.

మీనం

కార్యజయం ఉంది. ఆర్థిక లబ్ధిని పొందుతారు. గృహోపకరణాలను కొంటారు. ఎదిగేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది బాల్యస్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story