Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (27/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

మేషం

సంకల్పించుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఆనందం పెరుగుతుంది. ధన సంబంధ చిక్కులు ఉండవు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇతరుల తోడ్పాటూ లభిస్తుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.

వృషభం

అజమాయిషీ చెలాయించే అవకాశం లభిస్తుంది. నిపుణతను ప్రదర్శిస్తారు. అన్నిటా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పాటు స్థిరత్వం పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలను చేపడతారు.

మిథునం

ఉదర సంబంధ సమస్యను నిర్లక్ష్యం చేయకండి. ఇంటికి దూరంగా గడిపే సూచన ఉంది. పెద్దలను కలుస్తారు. వృథా ఖర్చుంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు.

కర్కాటకం

తగాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా కోపాన్ని బయటికి ప్రదర్శించరాదు. పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. అనవసర పంతాలు, పోటీలకు వెళ్లకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

సింహం

వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మానసిక సంతృప్తి కలుగుతుంది. సంతాన విషయాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు.

కన్య

శుభ ఫలితాలను పొందుతారు. వేదన తీరుతుంది. వివారం పరిష్కారం అవుతుంది. అదృష్టం తోడుంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.

తుల

బద్ధకం వల్ల చిక్కుల్లో పడతారు. ఆటంకాలను అధిగమించి కార్యాలను సాధించుకోవాలి. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. కీలక నిర్ణయాల్లో సోదరుల సూచనలు మేలు చేస్తాయి. వాత సంబంధ సమస్య ఉంటుంది.

వృశ్చికం

స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలి. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. వాహన సంబంధ సమస్య ఉంటుంది. ఖర్చులు తగ్గించాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు

దీర్ఘకాలంగా ఊరిస్తోన్న వర్తమానం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసుకుంటారు. సోదరుల సహకారం లభిస్తుంది. ఆత్మయులను కలుస్తారు. బంధాలు బలపడతాయి.

మకరం

పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆందోళన కలుగుతుంది. ఇతరుల కారణంగా ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలోనూ చికాకులు ఏర్పడతాయి. ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం

అన్ని సందర్భాల్లో అదృష్టం కలిసొస్తుంది. ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. బాల్యమిత్రులను కలుస్తారు. మనోధైర్యం పెరుగుతుంది.

మీనం

కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. నిర్లక్ష్యం వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. మిత్రులతోనూ విభేదాలు గోచరిస్తున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఆచితూచి వ్యవహరించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories