Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మాఘ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి : సప్తమి ఉదయం గం.9.58 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: విశాఖ మధ్యాహ్నం గం.1.30 ని.ల వరకు ఆ తర్వాత అనూరాధ

అమృతఘడియలు: రేపు తె.వా.గం.4.27 ని.ల నుంచి గం.6.13 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.54 ని.ల నుంచి గం.7.40 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.33 ని.ల నుంచి గం.11.20 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి గం.4.00 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.40 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.20 ని.లకు

మేషం :

వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. శత్రుపీడ పెరుగుతుంది. చెప్పుడు మాటలను నమ్మడం వల్ల అయినవారినే అనుమానిస్తారు. స్వల్పంగా తగాదాలకూ ఆస్కారముంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

వృషభం :

సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. విందుకు హాజరవుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లబ్దిని పొందుతారు.

మిథునం :

చికాకులు తొలగిపోతాయి. మీలోని బలహీనతలను అధిగమిస్తారు. వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. విందుకు వెళతారు.

కర్కాటకం:

సంతాన సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. విలువైన వస్తువులు లేదా డాక్యుమెంట్లను జాగ్రత్త పరచండి. ఖర్చులు పెరుగుతాయి.

సింహం :

బుద్ధి నిలకడగా వుండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యవహారాల్లో నష్టపోతారు. డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. అవమానాలకు ఆస్కారముంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. స్థిరాస్తి లావాదేవీల్లో జాగ్రత్త.

కన్య :

అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. కీతక వ్యవహారంలో సత్తాను చాటుతారు. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.

తుల :

పనులకు ఆటంకాలుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇతరులతో ఇబ్బందులు వస్తాయి. మనసుకి కష్టంగా వుంటుంది. వేళకు భోజనం వుండదు. కంటి సమస్య వుంటుంది.

వృశ్చికం :

వ్యవహార జయం, ఉత్సాహాన్ని పెంచుతుంది. వ్యక్తిగత ఆకాంక్ష నెరవేరుతుంది. రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు.

ధనుస్సు :

మితిమీరిన ఖర్చులు వేదనకు గురి చేస్తాయి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. వేళకు భోజనం వుండదు. పోటీలకు దిగకండి. దూర ప్రయాణాల వల్ల లాభముండదు.

మకరం :

సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. కుటుంబంలో శుభ కార్యం గురించి చర్చిస్తారు. విందుకు హాజరవుతారు. ధనలాభం గోచరిస్తోంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభం :

ప్రయత్నించిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. పై అధికారుల ప్రశంసలను పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సౌఖ్యం వుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. బంధువులతో విరోధం గోచరిస్తోంది.ప్రయాణాల వల్ల లాభముండదు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

Show Full Article
Print Article
Next Story
More Stories