Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (19/2/2025)


Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, February 19, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, February 19, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
మేషం :
అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇతరుల కారణంగా నష్టపోతారు. అనుకున్న రీతిలో పనులు సాగవు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శత్రువులపై నిఘా వుంచండి.
వృషభం :
భాగస్వామ్య లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు వుంటాయి. స్వేచ్ఛను కోరుకుంటారు. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. విందులో పాల్గొంటారు.
మిథునం :
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు.
కర్కాటకం:
సంతాన సంబంధ విషయాలపై శ్రద్ధ వహించాలి. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని విడిచి కష్టపడాలి. ఆలోచనలను అదుపు చేయాలి. ఆర్థిక లావాదేవీలు ఏమంత తృప్తినివ్వవు. మనశ్శాంతి వుండదు.
సింహం :
స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా వుండండి. నమ్మక ద్రోహానికి ఆస్కారం వుంది. బుద్ధి నిలకడగా వుండదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కన్య :
ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. సోదరులతో సఖ్యత వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధైర్యసాహసాలతో చేసే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.
తుల :
వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వుంటాయి. చేయని తప్పునకు నింద భరించే సూచన వుంది. ఎవరికీ హామీలు ఇవ్వకండి. వేళకు భోజనం వుండదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు.
వృశ్చికం :
అదృష్టం వరిస్తుంది. పనులన్నీ సవ్యంగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. వాహనయోగం వుంది. ఆరోగ్యం బావుంటుంది. విందుకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.
ధనుస్సు :
కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా లేకుంటే భారీగా నష్టపోయే సూచన వుంది. ఆదాయానికి మించిన ఖర్చులు వుంటాయి. ప్రయాణం వల్ల లాభముండదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. పోటీల్లో పాల్గొనకండి.
మకరం :
ఆర్థిక లాభం వుంది. ఇష్టులతో వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. పరిచయాలు లాభసాటిగా వుంటాయి.
కుంభం :
అన్ని ప్రయత్నాలూ అనుకూలంగా సాగుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. ప్రభుత్వ పరమైన లబ్దిని పొందుతారు.
మీనం :
పనుల పూర్తికి బాగా శ్రమించాలి. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నం అనుకూలించదు. విధి నిర్వహణలో బద్ధకం పనికిరాదు. ఆరోగ్యం జాగ్రత్త. తీర్ణక్షేత్రాన్ని సందర్శించే వీలుంది. సంతాన విషయాలు చికాకు పరుస్తాయి.
శుభమస్తు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



