Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/2/2025)

Daily Horoscope Today In Telugu, February 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 14 Feb 2025 5:00 AM IST
Daily Horoscope Today
X

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

మేషం

వ్యవహారాల్లో బద్ధకం తగదు. అనవసర విషయాల్లో జోక్యం వల్ల తగాదాలు వస్తాయి. మీ తెలివితేటలకు తగ్గ గుర్తింపు వుండదు. ప్రణయ వ్యవహారాలు బెడిసికొడతాయి. ఖర్చు పెరుగుతుంది. మనశ్శాంతి వుండదు.

వృషభం

వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తారు. పనుల్లో అడ్డంకులు ఆందోళన కలిగిస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. సహచరులు ముఖం చాటేస్తారు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం

వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయం మిమ్మల్ని విశిష్టంగా నిలబెడుతుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది.

కర్కాటకం

ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల చిక్కుల్లో పడతారు. పైగా చెప్పుడు మాటలను నమ్మడం కూడా చేటు తెస్తుంది. కుటుంబంలోనూ చికాకులు తలెత్తుతాయి. వేళకు భోజనముండదు. అశాంతి కలుగుతుంది.

సింహం

చేపట్టిన కార్యాలు సజావుగా సాగుతాయి. ధన లాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. వాహన యోగం ఉంది. బంధువులతో విందుకు హాజరవుతారు. గౌరవం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి.

కన్య

నిర్దేశించుకున్న రీతిలో పనులు సాగవు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా వుండండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన వుంది. వృథా ఖర్చు పెరుగుతుంది. పోటీలకు దిగకండి.

తుల

శుభప్రదంగా సాగుతుంది. కార్య నిర్వహణలో సత్ఫలితాలను పొందుతారు. ఇష్టమైన వారి కలయిక ఆనందాన్ని పెంచుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన సంబంధ విషయాలు గర్వాన్ని కలిగిస్తాయి.

వృశ్చికం

నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశాలు కలిసివస్తాయి. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది.

ధనుస్సు

పనుల్లో జాప్యం చికాకు పెడుతుంది. దూర ప్రయాణం వుంది. సంతానంతో విభేదిస్తారు. అశాంతి పెరుగుతుంది. గురు సమానులను కలుస్తారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఉదర సంబంధ సమస్య సూచిస్తోంది

మకరం

ప్రతికూల ఫలితాలు మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. పోటీల్లో పాల్గొనకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వుండండి. తగాదాలు వద్దు. కోపాన్ని అదుపు చేసుకోండి.

కుంభం

చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. సహచరులతో బంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. బంధువులను కలుస్తారు. సంతాన విషయాలు తృప్తినిస్తాయి. మనశ్శాంతిని లభిస్తుంది.

మీనం

వివాదాలు దూరమవుతాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మానసిక చికాకులు తొలగుతాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అవసరమైన వేళ అదృష్టం వరిస్తుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story