Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 12, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 12, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.


మేషం

కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి వస్తుంది. వాహనాలు, గనుల తవ్వకం వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. మీ రహస్య బయటపడే వీలుంది. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధువులతో విరోధం వుంది.

వృషభం

కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రియమైన వారిని కలుసుకుంటారు. ఆర్థికంగా లబ్ది చేకూరుతుంది. సహచరులతో సఖ్యత వుంటుంది. ముఖ్యల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణం లాభిస్తుంది.

మిథునం

కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఇతరుల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మనశ్శాంతి వుండదు. ఆస్తి వ్యవహారాల్లో నష్టం సూచిస్తోంది. రెండో పెళ్లి యత్నం అనుకూలించదు. ముందుచూపుతో వ్యవహరించండి.

కర్కాటకం

కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు కలిసొస్తాయి. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది.

సింహం

కుటుంబానికి దూరంగా వెళ్లే సూచన వుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధువిరోధం గోచరిస్తోంది. వేళకు భోజనముండదు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. అసూయ గుణాన్ని దూరం చేసుకోండి.

కన్య

కుటుంబంలో శుభ కార్యాచరణ గురించిన చర్చలు జరుగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆకాంక్ష తీరుతుంది. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు.

తుల

కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. అన్నింటా అనుకూలంగా వుంటుంది. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. గౌరవమర్యాలు పెరుగుతాయి.

వృశ్చికం

కుటుంబంలో సంతానం తీరు చికాకు పెడుతుంది. అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మానసిక అశాంతి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు.

ధనుస్సు

వ్యవహారాలు ప్రతికూలంగా సాగుతాయి. ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. పోటీల్లో ప్రత్యర్థులదే పైచేయి అవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మకరం

కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనను పాటించండి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా వుంటాయి. ప్రత్యర్థులపై గెలుస్తారు.

కుంభం

సందేహాలు తీరడంతో బాధ తొలగిపోతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. పోయిన వస్తువు దొరుకుతుంది. బంధువులతో విందులో పాల్గొంటారు. మనశ్శాంతి వుంటుంది.

మీనం

అభీష్టం నెరవేరక పోవడం నిరాశను కలిగిస్తుంది. శక్తి సామర్థ్యాలు తగ్గినట్లు అనిపిస్తుంది. విరోధాలకు దూరంగా వుండండి. విలువైన వస్తువులను జాగ్రత్త పరచండి. ఉదర సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories