Telugu Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Telugu Horoscope Today 17th August 2024: కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం. తిధి: ద్వాదశి ఉదయం గం.8.05 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి. నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం గం.11.49 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ.

P Vijay Kumar Astrologer
Updated on: 17 Aug 2024 6:00 AM IST
Telugu Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
X

దిన ఫలాలు: 17- ఆగస్టు- 2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం.

తిధి: ద్వాదశి ఉదయం గం.8.05 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి.

నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం గం.11.49 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ.

అమృతఘడియలు: ఉదయం గం.7.12 ని.ల నుంచి గం.8.44 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత గం.4.16 ని.ల నుంచి గం.5.45 ని.ల వరకు.

వర్జ్యం: రాత్రి గం.7.17 ని.ల నుంచి గం.8.47 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.6.00 ని.ల నుంచి గం.7.41 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.9.10 ని.ల నుంచి గం.10.45 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.00 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 6.40 ని.లకు.

మేషం

అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది. శత్రువుల బెడద పెరుగుతుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ముందుకు సాగవు. దూర ప్రయాణం గోచరిస్తోంది. బాధ్యతల పట్ల నిర్లక్ష్యం తగదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం

ప్రతికూలతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. చెడుదారులు తొక్కడం మంచిది కాదు. ఉద్యోగులు అధికారుల కోపానికి గురవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి.

మిథునం

చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ధనలాభం ఉంది. విజ్ఞానాభివృద్ధికి అనుకూలమైన రోజు. బంధువులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సూచన పాటించండి.

కర్కాటకం

ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహార జయం ఉంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. కొత్త వస్తువులను కొంటారు. పోటీదారులను ఓడిస్తారు. కోర్టుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వేళకు భోజనం ఉండదు.

సింహం

ఇష్టకార్యం భంగమవుతుంది. ఆటంకాలు పెరుగుతాయి. వృథా వ్యయాలు పెరుగుతాయి. మనోవ్యధకు గురవుతారు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. విశ్లేషణ శక్తి సన్నగిల్లుతుంది. విధి నిర్వహణలో జాగ్రత్త.

కన్య

అననుకూల ఫలితాలుంటాయి. అవసరానికి డబ్బు సమకూరినా వృథా ఖర్చుల వల్ల నిల్వ ఉండదు. ఆలోచన విధానం మారుతుంది. అవసరానికి స్నేహితుల సహకారం లభించదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

తుల

స్వయంకృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు అందుకుంటారు. ధన సంబంధ విషయాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులు తోడుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి పెరుగుతుంది.

వృశ్చికం

చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. ఆర్థిక నష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా ఉండండి. అవమానాలు, నిందలకు ఆస్కారం ఉంది. అనవసర జోక్యం మానండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది.

ధనుస్సు

అన్ని విషయాల్లోనూ శుభ ఫలితాలను అందుకుంటారు. బ్యాంకులతో ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విందుకు హాజరవుతారు. చిన్ననాటి విషయాలు స్మరించుకుంటారు. రోజంతా ఉత్సాహంగా సాగుతుంది.

మకరం

తొందరపాటు నిర్ణయాలు వద్దు. అన్నింటా ఆటంకాలుంటాయి. ధన సంబంధ చిక్కులు వస్తాయి. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది.

కుంభం

శుభ కార్యాచరణకు శ్రీకారం చుడతారు. అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంటుంది. సంతానం గురించి శుభ వార్త వింటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు.

మీనం

కార్యజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. అధికారులు, పెద్దల అభిమానం పొందుతారు. మేలిమి అవకాశం అందివస్తుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story