Horoscope: ఆకస్మిక ధనలాభం.. ఉన్న చోటంతా శుభఫలితాలే..

Horoscope: ఆకస్మిక ధనలాభం.. ఉన్న చోటంతా శుభఫలితాలే..

P Vijay Kumar Astrologer
Updated on: 30 May 2024 6:01 AM IST
Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 30th May 2024
X

Horoscope: ఆకస్మిక ధనలాభం.. ఉన్న చోటంతా శుభఫలితాలే..

(తేది: 30-05-2024, గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : సప్తమి ఉదయం గం.11.43 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: ధనిష్ట ఉదయం గం.7.31 ని.ల వరకు ఆ తర్వాత శతభిషం

అమృతఘడియలు: రా.గం 11.25 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.56 ని.లవరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.20 ని.ల నుంచి గం.3.51 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.03 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు మళ్లీ మ.గం.3.17 ని.ల నుంచి గం.4.09 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 1.52 ని.ల నుంచి గం.3.30 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం 5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.47 ని.లకు


మేషం

ఆకస్మిక ధనలాభం ఉంది. పట్టువిడుపులతో కార్యాలు సాధించుకుంటారు. పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. కొత్త విషయాలను గ్రహిస్తారు.


వృషభం

యోగదాయకంగా ఉంటుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అత్తవారి వైపు చికాకులు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. బాధ్యతలతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


మిథునం

డబ్బు నిల్వ ఉండదు. బంధువుల నుంచి ఛీత్కరాలు ఎదురవుతాయి. సంతానపు వ్యవహారాలు అశాంతిని కలిగిస్తాయి. శత్రువులు మీ బలహీనతలపై దెబ్బ తీస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. నవగ్రహాలను దర్శించండి.


కర్కాటకం

అవకాశాలు అందినట్లే అంది చేజారే సూచన ఉంది. ఇతరులపై అకారణ శత్రుత్వం ఏర్పడుతుంది. స్వల్ప తగాదాలుంటాయి. మనోద్రేకాన్ని అదుపులో ఉంచండి. శ్రీమన్నారాయణుడిని పూజించండి.


సింహం

భాగస్వాములతో వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి మాట వినండి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు.


కన్య

పనులు విజయవంతంగా సాగుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. మనోవ్యాధి దూరమవుతుంది. మేనమామలకు సంబంధించిన వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.


తుల

మీలోని సృజనాత్మక శక్తి ఉపకరించదు. కార్యసాధనకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సంతాన వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. దుర్గమ్మను పూజించడం మేలు.


వృశ్చికం

పనులు వేగంగా సాగవు. ఫైళ్ల నిర్వహణలో అలసత్వం వల్ల అవమానపడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భూసంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి.


ధనుస్సు

అన్నివైపులా మంచి ఫలితాలే ఉంటాయి. విలువైన సమాచారాన్ని అందుకుంటారు. దగ్గరి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రుల సహకారం విశేష లాభాన్ని చేకూరుస్తుంది. ఆత్మధైర్యం మెరుగవుతుంది.


మకరం

డబ్బు లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. మేనమామ గురించిన సమాచారం అందుతుంది. ఇంటి విషయమై తగాదాలకు దిగే సూచన ఉంది. మాటకు విలువ ఉండదు. శివుణ్ణి పూజించడం మేలు చేస్తుంది.


కుంభం

పనుల్లో పురోగతి ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. చురుకైన మీ బుద్ధికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.


మీనం

పనులు సవ్యంగా సాగవు, దుర్వ్యసనాలకు, ఆసుపత్రులకు ఖర్చు చేస్తారు. నిద్రలేమి వేధిస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ప్రయాణాలు ఆశించిన ఫలితాన్నివ్వవు. దత్తాత్రేయుడిని పూజించడం మేలు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story