Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్.. డబ్బుకి మాత్రం చాలా ఇబ్బంది..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్.. డబ్బుకి మాత్రం చాలా ఇబ్బంది..
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్.. డబ్బుకి మాత్రం చాలా ఇబ్బంది..

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్.. డబ్బుకి మాత్రం చాలా ఇబ్బంది..

(తేది: 21-05-2024, మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : త్రయోదశి సాయంత్రం గం.5.39 ని.ల వరకు తర్వాత చతుర్దశి

నక్షత్రం: చిత్త తె.వా. గం.5.46 ని.ల వరకు, తర్వాత స్వాతి

అమృతఘడియలు: రాత్రి గం.1014 ని.ల నుంచి గం.11.58 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.50 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.34 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ.గం.8.19 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.07 ని.ల నుంచి గం.11.51 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.28 ని. ల నుంచి సాయంత్రం గం.5.06 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.43 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం. 6.43 ని.లకు


మేషం :

ఆశించిన ఫలితం లభిస్తుంది. తల్లి పుట్టింటి వారి నుంచి మేలు జరుగుతుంది. సంబంధాలు మెరుగు పడతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది.


వృషభం :

శుభ ఫలితాలను అందుకుంటారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.


మిథునం :

అడ్డంకులను దాటాల్సి వుంటుంది. బద్ధకం వల్ల కార్యనష్టం గోచరిస్తోంది. నిరాశ, అనుమానాలను దూరం చేసుకోండి. స్థిరచిత్తంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి.


కర్కాటకం:

ఇంటి పనులు సవ్యంగా సాగవు. అవిశ్రాంతంగా కష్టపడాల్సి వస్తుంది. భూసంబంధ వ్యవహారాలు అనుకూలించవు. ఆస్తిని కాపాడుకునే ప్రయత్నాలు బెడిసికట్టే సూచన ఉంది. అమ్మవారిని పూజించండి.


సింహం:

లక్ష్యాన్ని చేరుకుంటారు. అవసరమైన కీలక వర్తమానం అందుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. ఇరుగుపొరుగు వారితో సఖ్యత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాల సూచన ఉంది. మనశ్శాంతి కలుగుతుంది.


కన్య:

బ్యాంకు వ్యవహారాలు అనుకూలించవు. మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి వుంటుంది. దంతాలు, కంటి సంబంధ సమస్య చికాకు పెడుతుంది. పూచీ సంతకాలు చేయకండి. నవగ్రహాలను దర్శించండి.


తుల:

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృథాఖర్చులు చికాకు పెడతాయి.


వృశ్చికం:

మనసు కలతబారుతుంది. బంధువులతో వ్యవహారాల్లో జాగ్రత్త. బద్ధకాన్ని వదిలిపెట్టండి. కావలసిన వారి వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. కనకదుర్గమ్మను పూజించండి.


ధనుస్సు:

మీ సలహాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో లాభాలుంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. వాహనయోగం ఉంది. మిత్రులను కలుస్తారు. కలిసికట్టుగా చేసే పనులు లాభదాయకంగా ఉంటాయి.


మకరం:

నాయకత్వ పటిమ పెరుగుతుంది. వృత్తి, వాణిజ్య వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల తీరు సంతృప్తినిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.


కుంభం:

దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. విడాకుల వ్యవహారాల్లో కీలక సమాచారం అందుతుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మీనం:

అప్రమత్తంగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మేయకండి. రుణాల వసూలులో ఇబ్బందుంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories