Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో ఊహించని లాభం..
Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో ఊహించని లాభం..
(తేది: 16-05-2024, గురువారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం
తిధి : అష్టమి ఉదయం గం.6.22 ని.ల వరకు, ఆ తర్వాత నవమి
నక్షత్రం: మఖ సాయంత్రం గం. 6.14 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ
అమృతఘడియలు: సాయంత్రం గం.3.33 ని.ల నుంచి గం.5.20 ని.ల వరకు
వర్జ్యం: మే 17 తె.వా. గం 3.15 ని.ల నుంచి గం.5.04 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.10.03 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం గం.3.14 ని.ల నుంచి సాయంత్రం గం.4.06 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.1.50 ని.ల నుంచి గం.3.27 ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం గం.5.44 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.41 ని.లకు
మేషం : బద్ధకం వల్ల సమస్యలు వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే నిందలు తప్పవు. అనుమానాలు, భయాందోళనలు వదిలిపెట్టండి. వాత సంబంధ ఇబ్బందులుంటాయి. శ్రీమన్నారాయణుడిని పూజించండి.
వృషభం : సొంత నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సూచనలు పాటించండి. డబ్బుకి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. తల్లి వైపు బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. గణపతిని పూజించండి.
మిథునం : సోదరులతో సఖ్యత ఉంటుంది. చేపట్టిన పని సఫలం అవుతుంది. విశేష లాభం గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. విలువైన సమాచారం అందుతుంది. ఆత్మయుల కలయిక ఆనందాన్నిస్తుంది.
కర్కాటకం: కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. బుద్ధికుశలతను ప్రదర్శించండి. అకారణ విరోధాలు సూచిస్తున్నందున ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. ఎవరికీ పూచీ ఇవ్వకండి.
సింహం: ఆనందమయంగా ఉంటారు. ధనలాభం ఉంది. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనువుగా ఉంటుంది. కీలకమైన పనిలో అదృష్టం తోడవుతుంది.
కన్య: శత్రువులు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. మనసు కలతబారే ఘటనలు ఎదురవుతాయి. స్థిరచిత్తంతో ఉండండి. వ్యర్థ ప్రయాణాలు మానండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
తుల: యోగదాయకంగా ఉంటుంది. వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. అన్నివైపుల తగిన సహకారం అందుతుంది. పురోభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. గృహనిర్మాణ యత్నాల్లో కదలిక వస్తుంది.
వృశ్చికం: కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పురోభివృద్ధి దిశగా చక్కటి అవకాశాలు లభిస్తాయి. పెద్దలు తోడుగా ఉంటారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ధనుస్సు: దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. సంతానంతో సఖ్యత ఉండదు. కలహాలు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతి ఏర్పడుతుంది. డబ్బుకీ స్వల్ప ఇబ్బంది ఉంటుంది. నవగ్రహాలను ఆరాధించడం మేలు చేస్తుంది.
మకరం: అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు వక్రమార్గంలో పట్టే సూచన ఉంది. తగాదాలకు దూరంగా ఉండండి. అధికారులు, పెద్దల కోపానికి గురవుతారు. ఇష్టంలేని పని చేయాల్సి వచ్చినా రాజీ ధోరణిలో వెళ్లండి.
కుంభం: శుభప్రదంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు ఆనందదాయకంగా సాగుతాయి.
మీనం: అభీష్టం నెరవేరుతుంది. డబ్బు సమస్యలు తీరతాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire