Astro News: అందరిలో ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఈ గ్రహం ఎఫెక్ట్‌ ఇలాగే ఉంటుంది..!

Astro News: కొంతమంది అందరిలో ఉన్నా ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతుంటారు. మానసికంగా బాధపడుతుంటారు. తరచుగా ఎవ్వరితో కలవకుండా ఒంటరితనాన్ని కోరుకుంటారు.

Jyothi
Updated on: 19 Feb 2024 8:30 PM IST
Are you Feeling Alone even with Everyone it Means that the Moon Planet is Weak
X

Astro News: అందరిలో ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఈ గ్రహం ఎఫెక్ట్‌ ఇలాగే ఉంటుంది..!

Astro News: కొంతమంది అందరిలో ఉన్నా ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతుంటారు. మానసికంగా బాధపడుతుంటారు. తరచుగా ఎవ్వరితో కలవకుండా ఒంటరితనాన్ని కోరుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం జాతక రీత్యా, రాశి ప్రకారం ఒంటరితనం, మానసిక బలహీనత, ఆందోళన చంద్రగ్రహం బలంగా లేనప్పుడు ఎదురయ్యే సమస్యలు. ఇలాంటి సందర్భంలో చంద్రుడిని బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చంద్రుడికి అధిష్టానం శివుడు. అతడు చంద్రుడిని తలపై ధరించాడు. అందుకే శివుడిని పూజించడం వల్ల చంద్రుడికి బలం వస్తుంది. ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అతడి ఆశీర్వాదం పొందాలి. తెల్లని వస్త్రాలు, వెండి, పాలు, బియ్యం, ముత్యాలు, రుద్రాక్ష మొదలైన చంద్ర సంబంధిత వస్తువులను సోమవారం దానం చేయాలి. తల్లి, సోదరి, కుమార్తె, అత్త మొదలైన వారికి గౌరవం ఇవ్వాలి. వారి పుట్టినరోజున తప్పనిసరిగా బహుమతిని అందించాలి. వారు మీపై ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త వహించాలి.

ఆపదలో ఉన్న మహిళకి తెల్లని వస్తువులను దానం చేయాలి. ఆమెకు తెల్లని దుస్తులు బహూకరించాలి. తన శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా దుస్తులు ఇచ్చి పుణ్యాన్ని కూడగట్టుకోవాలి. పక్షులకు ఆహారం ఇవ్వాలి. ప్రతిరోజూ సమయానికి వాటికి ఆహారం అందించాలి. సోమవారం ఆలయానికి వెళ్లి కచ్చితంగా శివదర్శనం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు ఒక్కపొద్దు ఉండి శివుడిని ఆరాధించాలి. దీనివల్ల్ పాజిటివ్‌ ఫలితాలు కలుగుతాయి.

Jyothi

Jyothi

Next Story