Astro News: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఇలాంటి ఫొటోలను పెట్టాలి.. ఈ ప్రయోజనాలు లభిస్తాయి..!

Astro News: హిందూ సంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. కానీ కొంతమంది వాస్తును నమ్మరు. దీంతో జీవితంలో చాలా ఇబ్బందులను పడుతూ ఉంటారు.

Shekhar G
Updated on: 1 Feb 2024 5:30 PM IST
According To Vastu Such Pictures Should Be Placed Near The Main Door Of The House These Benefits Are Available
X

Astro News: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఇలాంటి ఫొటోలను పెట్టాలి.. ఈ ప్రయోజనాలు లభిస్తాయి..!

Astro News: హిందూ సంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. కానీ కొంతమంది వాస్తును నమ్మరు. దీంతో జీవితంలో చాలా ఇబ్బందులను పడుతూ ఉంటారు. నిజానికి ఇంట్లో ఉండే ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండాలి. అలాగే ఇంటి మెయిన్‌ గేట్‌ దగ్గర కొన్ని రకాల ఫొటోలను పెట్టాలి.వీటివల్ల ఇంట్లోకి నెగటివ్‌ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించుకుంటారు. కొందరు మొక్కలు పెడుతారు. మరికొందరు డెకరేషన్‌ ఐటమ్స్‌ పెడుతారు. ఇంకొందరు దేవడి ఫొటోలు పెడుతారు. అయితే ప్రధాన ద్వారం దగ్గర ఏది పడితే అది పెట్టకూడదు. వాస్తు ప్రకారం దానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి చాలా రకాల దేవుడి ఫొటోలు మార్కెట్‌లో లభిస్తాయి. అయితే ఏదైనా పెట్టేముందు వాస్తుపై అవగాహన ఉండాలి. లేదంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించినది కావచ్చు లేదా ఆర్థిక సంబంధమైనది కావచ్చు. అందుకే మెయిన్ గేటుపై ఎలాంటి ఫొటోలు పెట్టుకుంటే మేలు జరుగుతుందో వాస్తు శాస్త్రంలో చెప్పారు.

వాస్తు ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి చిత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. అవసరమైతే లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్‌ శక్తి ప్రవహిస్తుంది. అంతే కాదు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచడం ఆమె ఆశీర్వాదం దొరుకుతుంది. తద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే లక్ష్మిదేవి నవ్వుతూ కనిపించే ఫొటో పెట్టాలి. అలాగే ఇంట్లో ఆనందం కోసం ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. గణేశుడి ఫొటో ఇంటికి ఈశాన్య దిశలో మాత్రమే పెట్టాలి.

Shekhar G

Shekhar G

Next Story