Moles Meanings: శరీరంలోని ఈ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులు.. సంపదకు లోటు ఉండదు..!

Moles Meanings: జ్యోతిష్యం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలు వ్యక్తులు గుణగణాలను వ్యక్తీకరిస్తాయి. వారు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి వివరిస్తాయి.

Shekhar G
Updated on: 1 Dec 2023 8:30 PM IST
According To Samudrik Shastra A Mole On These Parts Of The Body Is Lucky
X

Moles Meanings: శరీరంలోని ఈ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులు.. సంపదకు లోటు ఉండదు..!

Moles Meanings: జ్యోతిష్యం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలు వ్యక్తులు గుణగణాలను వ్యక్తీకరిస్తాయి. వారు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి వివరిస్తాయి. సాముద్రిక్ శాస్త్రంలో పుట్టుమచ్చల గురించి తెలియజేశారు. ఒక వ్యక్తి బాడీలో పుట్టుమచ్చ ఎక్కడ ఉంది, అది ఏ సంకేతాన్ని సూచిస్తుందో తెలుస్తుంది. ఒక వ్యక్తి శరీరంలోని కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల అతడు ధనవంతుడు అవుతాడు. అలాంటి పుట్టుమచ్చలు శరీరంలో ఎక్కడ ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం.

చెంప మీద పుట్టుమచ్చ

ఒక వ్యక్తి చెంపపై పుట్టుమచ్చ ఉంటే అది చాలా శుభప్రదంగా చెబుతారు. అలాంటి వారు చాలా అదృష్టవంతులు. వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. భాగస్వాముల పట్ల నమ్మకంగా ఉంటారు. మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు.

నుదిటి పుట్టుమచ్చ

ఎవరికైనా నుదుటికి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే అతడు చాలా అదృష్టవంతుడు. వీరి సంపద పెరుగుతూనే ఉంటుంది. వీరికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఈ వ్యక్తులు శ్రమతో ఏదైనా సాధిస్తారు.

ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ

ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. సమాజంలో సొంత గుర్తింపును కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ప్లానింగ్‌లో చాలా ప్రవీణ్యులు.

కుడి అరచేతిలో పుట్టుమచ్చ

ఈ వ్యక్తులు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు. ఈ వ్యక్తులు పేరు, కీర్తిని సంపాదించడంలో ముందు వరుసలో ఉంటారు. సంపద పరంగా చాలా అదృష్టవంతులుగా చెబుతారు.

Shekhar G

Shekhar G

Next Story