Coronavirus Update In AP: ఏపీలో కొత్తగా 2,997 కేసులు!

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా టెస్టులు చేయగా 2,997 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

Krishna
Updated on: 25 Oct 2020 7:31 PM IST
Coronavirus Update In AP:  ఏపీలో కొత్తగా 2,997 కేసులు!
X

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా టెస్టులు చేయగా 2,997 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,07,023 కి చేరుకుంది. అయితే ఇందులో 30,860 యాక్టివ్ కేసులుండగా 7,69,576 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 21 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,587కి చేరుకుంది.

చిత్తూరులో ఐదుగురు, కడప ముగ్గురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 108, చిత్తూరులో 466, ఈస్ట్ గోదావరిలో 254, గుంటూరులో 301, కడపలో 153, కృష్ణాలో 358, కర్నూల్ లో 67, నెల్లూరులో 96, ప్రకాశంలో 340, శ్రీకాకుళం 86, విశాఖపట్నం 187, విజయనగరం 89, వెస్ట్ గోదావరి 492 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఎపీలో 75,70,352 కరోనా టెస్టులు నిర్వహించారు.

Krishna

Krishna

Next Story