Top
logo

Andhra Pradesh: ఏపీలో ఇవాళ జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ZP Chairman Election in Andhra Pradesh Today
X

ఆంధ్రప్రదేశ్ లో నేడు జడ్పీ చైర్మన్ ఎన్నిక (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా జిల్లాల కలెక్టర్లు

Andhra Pradesh: ఏపీలో ఇవాళ జెడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు.


Web TitleZP Chairman Election in Andhra Pradesh Today
Next Story