YV Subbareddy - Tirupati: తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు...

YV Subbareddy - Tirupati: అన్నపానీయాలు, ఇతర వసతులపై భక్తులతో మాటామంతీ

Shireesha
Updated on: 25 March 2022 4:41 PM IST
YV Subbareddy Sudden Checkings in Tirupati | TTD Latest News
X

YV Subbareddy - Tirupati: తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు...

YV Subbareddy - Tirupati: శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు నిరంతరం మంచినీరు, ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా గతంలో నిలుపుదల చేసిన అన్నపానీయాల వితరణను పునరుద్ధరించాలని సూచించారు. తిరుమల‌ కొండకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

టీటీడీ ఫ్రీ ఫుడ్ కౌంటర్స్, యాత్రికుల వసతి సముదాయం, దర్శన క్యూలైన్లలో రద్దీకి తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. దర్శనం, వసతి, మంచినీరు, ఆహారం పంపిణీలో ఏదైనా ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలపై కొందరు భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు‌.

Shireesha

Shireesha

Next Story