YV Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

YV Subba Reddy: వైవీతో ప్రమాణస్వీకారం చేయించిన టీటీడీ ఈవో * రెండోసారి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 1:49 PM IST
YV Subba Reddy Take the Oath as TTD Chairman
X
టీటీడీ చైర్మన్ గా ప్రమాణ శ్వీకారం చేసిన వైవీ సుబ్బా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

YV Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. 2019లో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఈ ఏడాది జూన్‌ 22 వరకు కొనసాగారు. రెండోసారి కూడా ఆయననే చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story