రేపు మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తాం: పేర్ని నాని

YSRCP Support AP Bandh
x

రేపు మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తాం: పేర్ని నాని

Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు చేపడుతోన్న రాష్ట్ర బంద్‌‌కు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మంత్రి పేర్ని నాని...

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు చేపడుతోన్న రాష్ట్ర బంద్‌‌కు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. తమ ప్రభుత్వం కూడా బంద్‌కు సహకరిస్తుందని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. విశాఖ‌ ఉక్కును ఎప్పటికీ ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని పేర్ని నాని తెలిపారు. రేపటి బంద్‌‌కు సంఘీభావం తెలుపుతోన్న తమ ప్రభుత్వం కార్మికులకు మద్దతుగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొంటారని పేర్ని నాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories