Sajjala Ramakrishna Reddy: వైసీపీకి ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంది

Sajjala Ramakrishna Reddy: 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం

Shekhar G
Updated on: 21 Feb 2024 8:16 PM IST
YSRCP Secretary Sajjala Interesting Comments AP Elections
X

Sajjala Ramakrishna Reddy: వైసీపీకి ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంది

Sajjala Ramakrishna Reddy: వైసీపీకి ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉందని ప్రభుత్వ సలహారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరీక్షలు రాసే పిల్లల్లా.. కార్యకర్తలు రాబోయే ఈ 50 రోజులు ఇదే పని చేయాలన్నారు. సునామీలాగా వస్తున్న ఆదరణను.. పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్ లను నొక్కించాలని సజ్జల అన్నారు. 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశామన్నారు.

అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారన్నారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చిందని సజ్జల అన్నారు . రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్ల లో తిరుగుతున్నాడు అని సజ్జల ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story