కాసేపట్లో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

కాసేపట్లో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
x

కాసేపట్లో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Highlights

కాసేపట్లో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకానుంది. పార్లామెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై...

కాసేపట్లో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకానుంది. పార్లామెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా వైసీపీ పార్లమెంట్‌లో లేవనెత్తనుంది.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, పెండింగ్ బకాయిల విడుదల వంటి అంశాలతో పాటు ప్రత్యేక హోదా పైనా కేంద్రాన్ని అడగానున్నారు వైసీపీ ఎంపీలు. వీటితో పాటు మూడు రాజధానులు అంశం, కర్నూల్‌‌‎‌లో హై కోర్టు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రాన్ని కోరనున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలిసి కోరారని ఇప్పుడు మరోసారి పార్లమెంట్ వేదికగా ఈ అంశాలను లేవనెత్తనున్నారు ఎంపీలు.

అంతేకాకుండా రాజకీయమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఎంపీలకు సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు అంశం టీడీపీ, బీజేపీ ఎంపీలు లేవనెత్తే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలని చెప్పనున్నారు సీఎం జగన్.
Show Full Article
Print Article
Next Story
More Stories