Vijayasai Reddy: ఏరోజైనా మాన్సాస్ చైర్మన్ జైలుకు వెళ్లక తప్పదు

Vijayasai Reddy: మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ పాలిటిక్స్‌ హాట్ హాట్‌గా మారిపోయాయి.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 5:14 PM IST
YSRCP MP Vijayasai Reddy Slams Mansas Trust Chairman Ashok Gajapathi Raju
X

Vijayasai Reddy: ఏరోజైనా మాన్సాస్ చైర్మన్ జైలుకు వెళ్లక తప్పదు

Vijayasai Reddy: మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ పాలిటిక్స్‌ హాట్ హాట్‌గా మారిపోయాయి. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుకుంది. విజయసాయిరెడ్డి జ్ఞానం పెంచుకోవాల్సిందే అన్న అశోక్ ఘాటు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. వందల ఎకరాలు దోచుకున్న మీరు ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని హెచ్చరించారు.

మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. కొన్ని వందల ఎకరాలు దోచుకున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు అన్న విజయసాయి.. ఏరోజైనా మాన్సాస్ చైర్మన్ జైలుకు వెళ్లకతప్పదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story