వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం!

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం!
x

pilli subhash chandra bose 

Highlights

Pilli Subhash Chandra Bose Wife : వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. అయన సతిమణి పిల్లి సత్యనారాయణమ్మ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

Pilli Subhash Chandra Bose Wife : వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. అయన సతిమణి పిల్లి సత్యనారాయణమ్మ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆమె మరణంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయం తెలియగానే పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున రామచంద్రాపురంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కొందరు వైసీపీ నేతలు సుభాష్ చంద్రబోస్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అటు సత్యనారాయణమ్మ అంత్యక్రియలు రేపు(సోమవారం) తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురంలో జరగనున్నట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. అయన అకాల మరణంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరారు. అయితే గత ఎన్నికల్లో అయన ఓటమిపాలు కాగా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మంత్రివర్గంలో తీసుకున్నారు జగన్.. ఆ తర్వాత అయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ, మంత్రి పదవికి అయన రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories