Tekkali: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా

Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబం వివాదం వీధికెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2024 11:43 AM IST
YSRCP MLC Duvvada Srinivas Daughters Protest In Tekkali House
X

Tekkali: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా

Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబం వివాదం వీధికెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్దరాత్రి హైడ్రామా నెలకొన్నది. శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు. అక్కవరంలోని నూతన గృహం ముందు నిన్న సాయంత్రం ఏడు గంటల నుండి అర్దరాత్రి వరకు నిరీక్షించింది. ఎన్నికల ముందు జరిగిన ఘటనలతో శ్రీనివాస్ భార్యా, బిడ్డలను విడిచి ఉంటున్నారు.

తాజాగా ఆయన కుమార్తెలు తండ్రి దగ్గరే ఉండేందుకు సిద్దం అయ్యారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో ఇంటి బయట కారులోనే నిరీక్షించారు. తన తండ్రితో కలిసి ఉంటామని.. ఇదే విషయాన్ని తన తండ్రికి చెబుతామని మెసేజ్‌లు పెట్టారు. అయినా స్పందించలేదు. తన తండ్రి నుంచి సమాచారం వచ్చినంత వరకు ఇక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు కుమార్తెలు. ఇదే సమయంలో ఎప్పుడు లైట్లు వెలిగి ఉండే వైసీపీ కార్యాలయంలో చీకటిగా ఉన్నాయి. దువ్వాడ ఇంట్లో ఆయనతో పాటు మరికొందరు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటి తలుపులు తీయకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story