Vasantha Krishna Prasad: గొల్లపూడి పర్యటనలో చంద్రబాబు వాస్తవాలు మాట్లాడలేదు

Vasantha Krishna Prasad: గొల్లపూడి పర్యటనలో చంద్రబాబు వాస్తవాలు మాట్లాడలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 31 July 2021 3:33 PM IST
YSRCP MLA Vasantha Krishna Prasad about Chandrababu Gollapudi Visit
X

Vasantha Krishna Prasad: గొల్లపూడి పర్యటనలో చంద్రబాబు వాస్తవాలు మాట్లాడలేదు

Vasantha Krishna Prasad: గొల్లపూడి పర్యటనలో చంద్రబాబు వాస్తవాలు మాట్లాడలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. మైనింగ్ క్వారీపై కలెక్టర్ అభ్యంతరం చెబితే అనుమతి తెచ్చింది ఉమా కాదా అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మైనింగ్ జరిగిన భూములు రెవెన్యూ పరిధిలో ఉంటే వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఫారెస్ట్ భూములుగా మారిపోతాయా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. నందిగామ నియోజకవర్గ పరిధిలో 2018లో క్వారీయింగ్ జరిగితే తనకు ముడిపెడతారా అని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబు, దేవినేని ఉమాకు బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story