మేము ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా? : వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

Jyothula Chanti Babu: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు హాట్ కామెంట్ చేశారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2022 2:39 PM IST
YSRCP MLA Jyothula Chantibabu Comments Hints at Party Charge
X

మేము ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా? : వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

Jyothula Chanti Babu: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు హాట్ కామెంట్ చేశారు. పార్టీలు గాడిద గుడ్డు... ఇవాళ ఉంటాయి, రేపు పోతాయన్నారు. మేము ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అని అన్నారు. ఏ పార్టీ లో ఎవరు శాశ్వతం...ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో? అని తెలిపారు. రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసని అన్నారు. జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా తనకు సహకరిచండం లేదన్న అసహనంతో జ్యోతుల చంటిబాబు ఉన్నారు. జనసేన, టీడీపీలు తనను విమర్శలతో వెంటాడుతుండటంతో జ్యోతుల చంటిబాబు అసహనానికి గురై ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story