YSRCP MLA tests positive for coronavirus: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్

Arun Chilukuri
Published on: 22 July 2020 5:14 PM IST
YSRCP MLA tests positive for coronavirus: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్
X

YSRCP MLA tests positive for coronavirus: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల అంబటి రాంబాబును కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story