Andhra Pradesh: ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారు- అంబటి రాంబాబు

Andhra Pradesh: ఏపీలో మళ్లీ పొలిటికల్ వార్ ప్రారంభమైంది. ఏకపక్ష నిర్ణయం అంటూ టీడీపీ పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం పట్ల మాటల మంటలు రాజుకున్నాయి.

Arun Chilukuri
Published on: 2 April 2021 5:57 PM IST
YSRCP MLA Ambati Rambabu slams Chandrababu
X

Andhra Pradesh: ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారు- అంబటి రాంబాబు

Andhra Pradesh: ఏపీలో మళ్లీ పొలిటికల్ వార్ ప్రారంభమైంది. ఏకపక్ష నిర్ణయం అంటూ టీడీపీ పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం పట్ల మాటల మంటలు రాజుకున్నాయి. టీడీపీ అధినేత చేసిన ప్రకటనపై వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందన్న అంబటి ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో నిమ్మగడ్డ ఎవరికీ చెప్పకుండానే ఎన్నికలు నిలిపివేశారన్న అంబటి అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికలను చంద్రబాబు ఎందుకు బహిష్కరిస్తున్నారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story