Top
logo

లోటస్‌ పాండ్‌లో షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

లోటస్‌ పాండ్‌లో షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
X

లోటస్‌ పాండ్‌లో షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

Highlights

లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ షర్మిలను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ భేటీ వెనక...

లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ షర్మిలను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ భేటీ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆర్కే తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని వెల్లడించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె షర్మిల అంటే తనకు చాలా గౌరవమని అందుకే కలిశానని ఆర్కే స్పష్టం చేశారు. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం నేడు ముగిసింది. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

Web TitleYSRCP MLA Alla Ramakrishna Reddy Meets YS Sharmila
Next Story