నేడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల

తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న జగన్

Shashank Gullapelli
Published on: 27 April 2024 9:55 AM IST
YSRCP Manifesto Releasing Today
X

నేడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల

ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావటంతో... మేనిఫెస్టోలపై పార్టీలు ఫోకస్ చేశాయి. జగన్ ఈ నెల 28వ తేదీ నుంచి ఎన్నికల మలి విడత ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇవాళ జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి నిమిషంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఓట్ బ్యాంక్ పైన జగన్ గురి పెట్టారు. ఇప్పటికే మేనిఫెస్టోపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేశారు. నవరత్నాలను కొనసాగిస్తూనే కొన్నింటి పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story