ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: వైవీ సుబ్బారెడ్డి

ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: వైవీ సుబ్బారెడ్డి
x

ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: వైవీ సుబ్బారెడ్డి

Highlights

*టీడీపీపై వైవీ సుబ్బారెడ్డి, రోజా తీవ్ర విమర్శలు *ఎన్నికల్లో గెలవదు కాబట్టే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: వైవీ సుబ్బారెడ్డి *టీడీపీ బెదిరింపులకు అధికారులు భయపడొద్దు: వైవీ సుబ్బారెడ్డి

ఏపీ పంచాయితీ పోరు పీక్స్‌కు చేరుకుంది. ఎన్నికల్లో టీడీపీ గెలవదు కాబట్టే రాద్ధాంతం చేస్తోందని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల బెదిరింపులకు ఎన్నికల అధికారులు ఎవరు బయపడొద్దన్న వైవీ సుబ్బారెడ్డి.. ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నారు. కుప్పంలో కొందరు అధికారులు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరతారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories