జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పంచాయతీ ఎన్నికలకు ఓకే

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పంచాయతీ ఎన్నికలకు ఓకే
x
Highlights

పంచాయతీ ఎన్నిలకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర‌్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్ధమని వైసీపీ ప్రకటించిందిసుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో పరిణామాలు వేగంగా...

పంచాయతీ ఎన్నిలకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర‌్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్ధమని వైసీపీ ప్రకటించిందిసుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సుప్రీం తీర్పుతో కంగుతిన్న ప్రభుత్వం.... తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఏజీతో సమావేశమైన సీఎం జగన్మోహన్‌రెడ్డి.... సుప్రీం తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ముఖ్య నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. ప్రజల కోసం చేసిన ఈ పోరాటంలో ఓటమైనా ఆనందంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

కాగా..కరోనా వ్యాక్సినేషన్‌ , ఎన్నికలు‌ రెండూ ఒకేసారి నిర్వహణ కష్టమన్న సజ్జల..వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకుంటామని వెల్లడించారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చివరి వరకు పోరాడిందని ఆ‍యన అన్నారు. ఎన్నికలు జరిపి తీరాలన్న ఎస్‌ఈసీ పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయని మరోసారి సజ్జల ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories