Tirupati: నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి

Tirupati: నెల్లూరులో తిరుపతి ఉప ఎన్నికల నామినేషన్ల కోలాహలం నెలకొంది.

Arun Chilukuri
Published on: 29 March 2021 3:20 PM IST
YSRCP Candidate Gurumurthy Files Nomination For Tirupati By-Election
X

Tirupati: నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి

Tirupati: నెల్లూరులో తిరుపతి ఉప ఎన్నికల నామినేషన్ల కోలాహలం నెలకొంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. వైసీపీకి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయానికి చేరుకొని వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులు అర్పించారు. తర్వాత వైసీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకొని మూడు సెట్ల​ నామినేషన్‌ దాఖలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story