పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్. విగ్రహాం కూల్చివేత

*జనసేనకు సపోర్ట్ చేస్తూ, టీడీపీ, బీజేపీ, వైసీపీలను దూషించిన వ్యక్తి

Rama Rao
Published on: 4 May 2022 1:14 PM IST
YSR Statue Demolition in Parvathipuram Vizianagaram District
X

పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్. విగ్రహాం కూల్చివేత

Vizianagaram: విజయనగరం జిల్లాల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేశారు. విగ్రహాన్ని పడగొట్టి ఈడ్చుకెళ్లడం వివాదాస్పదమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లిగ్రామంలో విగ్రహాన్ని పడగొట్టాడని గ్రామస్తులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని పాడుచేసిన వ్యక్తి జనసేనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ టీడీపీ, బీజేపీ, వైసీపీలను దూషించారని వ్యక్తిని నిర్బంధించారు. విగ్రహాన్ని పడగొట్టిన వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలుసుకున్నారు. విగ్రహాన్ని పడగొట్టిన విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు కృష్ణపల్లి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. విగ్రహ పున:ప్రతిష్టకు చొరవ తీసుకుంటామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story