YSR Nutrition Food Schemes: అమ్మ‌కు అండ‌గా.. జ‌గ‌న్ స‌ర్కార్ నూత‌న ప‌థ‌కాలు

YSR Nutrition Food Schemes: అమ్మ‌కు అండ‌గా.. జ‌గ‌న్ స‌ర్కార్ నూత‌న ప‌థ‌కాలు
x

  YSR Nutrition Food Schemes:  

Highlights

YSR Nutrition Food Schemes: పేద కుటుంబాల‌కు చెందిన‌ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అద‌న‌పు పౌష్టికాహారాన్ని అందించాలనే సంక‌ల్పంతో జ‌గ‌న్ స‌ర్కార్ మరో నూత‌న ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ది

YSR Nutrition Food Schemes: పేద కుటుంబాల‌కు చెందిన‌ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అద‌న‌పు పౌష్టికాహారాన్ని అందించాలనే సంక‌ల్పంతో జ‌గ‌న్ స‌ర్కార్ మరో నూత‌న ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ది. అవే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్. ఈ ప‌థ‌కాల‌ను వ‌చ్చే నెల 1న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్", మిగిలిన మండలాల్లో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" ల అమ‌లుకు విధి విధానాల‌ను రూపొందిస్తున్న‌ది.

పేద‌రికం వ‌ల్ల‌‌ చాలా మంది గ‌ర్భిణులు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అదనపు పౌష్టికాహారం వంటి స‌మ‌స్య‌లను బాధ‌ప‌డుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ పథకాలు రూపొందిస్తున్న‌దిఇందుకుగానూ..రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీలపరిధిలో 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే అవ‌కాశం ఉంది. ఇందుగాను బడ్జెట్‌లో ఏడాదికి రూ.1863 కోట్లను వెచ్చించ‌నున్న‌ది జ‌గ‌న్ స‌ర్కార్‌. గర్భిణులు, బాలింతలకు, 6-36 నెలల పిల్లలకు పౌష్టికాహారం, 3 నుండి 6 సం. ల పిల్లలందరికీ ప్రతి రోజు పాలు, గ్రుడ్లు అందించ‌నున్నారు. మైదాన ప్రాంతాల్లోని 47,287 అంగన్ వాడీల పరిధిలో 26.36 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,555.56 కోట్లతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయ‌నుండ‌గా.. గిరిజన ప్రాంతాల్లోని 8,320 అంగన్ వాడీల పరిధిలో 3.8 లక్షల మంది లబ్ధిదారులకు రూ.307.55 కోట్లతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీకి శ్రీ‌కారం చుట్టింది.

ఇందుకు గానూ.. గిరిజన ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు నెల‌కు రూ.1100, పిల్లలకు రూ.553, చిన్నారులకు రూ.620 ఖర్చు చేయనున్న‌ది. అలాగే మైదాన ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు నెల‌కు రూ.850, పిల్లలకు రూ.350, చిన్నారులకు రూ.412 ల‌ను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. గతంలో కేవలం రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకే పౌష్టికాహారం. ప్రస్తుతం వాటితో సంబంధం లేకుండా లబ్దిదారులందరికీ పౌష్టికాహారాన్ని అందించేది.

Show Full Article
Print Article
Next Story
More Stories