Ambulance Staff Collect Money: కరోనా పేరుతో మోసం..అంబులెన్స్ నిర్వహకుల నిర్వాకం

Ambulance Staff Collect Money: కరోనా పేరుతో మోసం..అంబులెన్స్ నిర్వహకుల నిర్వాకం
x

Ambulance Staff Collect Money

Highlights

Ambulance Staff Collect Money: కరోనా పేరు చెబితేనే భయంతో వణికి పోతున్నారు సామన్య జనం. అలాంటిది నేరుగా కరోనాతో మరణించారని చెచితే ఇంకేమయినా ఉందా? అల్లంత దూరం పారిపోతారు..

Ambulance Staff Collect Money: కరోనా పేరు చెబితేనే భయంతో వణికి పోతున్నారు సామన్య జనం. అలాంటిది నేరుగా కరోనాతో మరణించారని చెచితే ఇంకేమయినా ఉందా? అల్లంత దూరం పారిపోతారు.. ఇలాంటి వ్యవహారాన్ని క్యాష్ చేసుకున్నారు అంబులెన్స్ ప్రబుద్ధులు. సాధారణ వ్యాధితో చనిపోతే, కరోనాతో మరణించారిని చెప్పి, అంత్యక్రియలకు అత్యధిక సొమ్ములు లాక్కొని బాధితులను మోసం చేశారు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను వివరిస్తూ మరొకరు మోసపోవద్దని కోరారు.

కరోనా సమయంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి, అంత్యక్రియలకు అంబులెన్స్‌ నిర్వాహకులు రూ.85 వేలు వసూలు చేశారు. డెత్‌ సర్టిఫికెట్‌లో కరోనాతో చనిపోలేదని తెలుసుకుని అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది చేతిలో మోసపోయామని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరొకరు మోసపోవద్దని కోరారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు(67) ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి చెందకముందే తరలించాలని తొందరపెట్టారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్‌ అక్కడి నుంచే ఫోన్‌లో అంబులెన్స్‌ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్‌ పే ద్వారా సురేష్‌బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది.

డెత్‌ సర్టిఫికెట్‌తో వెలుగులోకి..

సాయినాథ్‌రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ చూసి షాక్‌ తిన్నారు. సాయినాథ్‌రావు కరోనాతో చనిపోలేదని, సీఆర్‌ఎఫ్‌(క్రానిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ లేదా క్రానిక్‌ రీనల్‌ ఫెయి ల్యూర్‌)తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్‌ రేవతి పేరుతో ధ్రువపత్రం అందించారు. దీనిని వాట్సాప్‌ లో విదేశాల్లోని కుమారుడు క్రాంతి కిరణ్‌కు పంపించారు.జరిగిన మోసాన్ని తెలుసుకున్న అతను..విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories