Andhra Pradesh: ఏపీలో ఈరోజు వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలు

* వరుసగా రెండో ఏడాది నగదు జమ * లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున సాయం

Sandeep Reddy
Published on: 22 July 2021 8:49 AM IST
YSR Kapu Nestham Scheme Second Year Implementation in Andhra Pradesh From 22 07 2021
X

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలు కానుంది. వరుసగా రెండో ఏడాది లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జయ చేయనుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు 15వేల రూపాయల చొప్పున అందించనున్నారు. 3లక్షల 27వేల 244మంది లబ్ధిదారులకు 490కోట్ల 86లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story