Kuppam: కుప్పంలో వైసీపీ నేత ఆత్మహత్య ..

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ వైసీపీ నేత ఆత్మహత్య కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 7 April 2022 3:32 PM IST
YSR Congress Party Leader Partha Sarathi Commits Suicide
X

Kuppam: కుప్పంలో వైసీపీ నేత ఆత్మహత్య ..

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ వైసీపీ నేత ఆత్మహత్య కలకలం రేపుతోంది. పదవుల పంపకాలు జరుగుతున్న సమయంలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలపై విగతజీవిగా మారడం చర్చనీయాంశంగా మారింది. కుప్పం పట్టణంలో వైసీపీకి దన్నుగా ఉన్న పార్థసారథి ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ ఛైర్మన్ గా పని చేసిన ఆయన కుప్పం మున్సిపాలిటీ కాకముందు వార్డు సభ్యునిగా రెండు సార్లు పని చేసారు. వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న పార్థసారథి మున్సిపాలిటీ ఎన్నికలలో సీటు దక్కలేదు.

అదే సమయంలో తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీలోనూ ఆయనకు అవకాశం లేదన్న విషయం తేటతెల్లమైంది. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య పై పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఆయన ఆత్మహత్య కు గల కారణాలను కుటుంబ సభ్యులు గానీ పోలీసులు గానీ వెల్లడించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story