తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి ఖరారు
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయ్. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించగా అక్కడ గురుమూర్తిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికపై పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించిన జగన్ అన్నికోణాలను పరిగణలోని తీసుకున్న తర్వాత డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఐతే ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని మంత్రి బొత్స తెలిపారు. దుర్గాప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
Next Story




