YSR Cheyutha: నేడు రెండో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల

YSR Cheyutha: ఏపీలో నేడు రెండో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేయనున్నారు.

Arun Chilukuri
Updated on: 22 Jun 2021 2:40 PM IST
YSR Cheyutha: CM Jagan to Transfer Rs 4,339.39 Crore to Beneficiaries
X

జగన్(ఫైల్ ఇమేజ్ )

YSR Cheyutha: ఏపీలో నేడు రెండో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45–60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేయనుంది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్‌ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story