YSR Asara scheme: డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభవార్త!

YSR Asara scheme: డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభవార్త!
x
CM Jagan,
Highlights

YSR Asara scheme: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే రాష్ట్ర పాలన పైన ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టారు ఏపీ సీఎం జగన్.. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒక్కో హమీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

YSR Asara scheme: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే రాష్ట్ర పాలన పైన ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టారు ఏపీ సీఎం జగన్.. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒక్కో హమీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కరోనా లాంటి సంక్షోభంలో కూడా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 108, 104 వాహనాలను ముందుకు తీసుకువచ్చిన జగన్ .. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడ‌తను మాఫీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లోని మొత్తం 9 లక్షలు 33 వేల సంఘాల స‌భ్యులకు రూ.27,168 కోట్ల రుణం ఉన్నట్లు అధికారులు గ‌తేడాది గుర్తించారు.

దీంతో మొద‌టి విడ‌త‌గా రూ.6,792 కోట్లు చెల్లించాలి. ఈ ప‌థ‌కాన్ని సెప్టెంబ‌ర్ 11వ తేదీన ప్రారంభించ‌నున్నట్లు సీఎం జ‌గ‌న్ ప్రక‌టించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ డబ్బును నేరుగా డ్వాక్రా స‌భ్యుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని నిర్ణయించింది. ఈ సొమ్మును కార్పొరేష‌న్ల ద్వారా విడుద‌ల చేయ‌నుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉంది ఏపీ సర్కార్..అయితే ఈ రుణాలను 4 విడ‌త‌లుగా మాఫీ చేస్తామ‌ని గతంలో సీఎం జ‌గ‌న్ వెల్లడించిన సంగతి తెలిసిందే..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా:

ఇక కరోనా సమయంలో కూడా జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకే సారి గుంపుగా చేరే అవకాశం ఉంది. దీంతో కరోనా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఆగష్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories