Nadendla Manohar: మత్స్యకారులను మోసం చేసిన వైసీపీ సర్కార్

YSP Government Cheated Fishermen
x

Nadendla Manohar: మత్స్యకారులను మోసం చేసిన వైసీపీ సర్కార్

Highlights

Nadendla Manohar: శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు మంత్రి ఏం చేశారో చెప్పాలి

Nadendla Manohar: మత్స్యకారులను వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం మోసం చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మత్స్యకార భరోసాలో వారికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏదయినా చేశామని చెప్పాలనకుంటే తన జిల్లాలోని ఏ మత్స్యకార గ్రామానికయినా రావాలని, తాను మాట్లాడడానికి సిధ్దంగా ఉన్నానని మనోహర్ సవాల్ విసిరారు. ఇటీవల పాకిస్తాన్ జైలులో ఉన్న మత్స్యకారుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని మోడీతో మాట్లాడారని గుర్తు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలో ఈ నెల 12న జరగనున్న జనశక్తి సమావేశం స్థలాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనసేనలో చేరిన కొంతమంది కార్యకర్తలకు కండువా వేసి ఆహ్వానించారు. వర్గానికో కులానికో కాకుండా ప్రజల కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న భూకబ్జా, ఇసుక మాఫియా ఇతరత్రా కబ్జాలపై మాట్లాడడాలని కోరారు. ఉత్తరాంధ్రలో యువతకు అండగా ఉంటామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories