YS Viveka: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్.. హత్యకు కొన్ని గంటల ముందు..

Another Twist In Viveka Murder Case
x

Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్

Highlights

Shamim: తెరపైకి వివేకా రెండో భార్య షమీమ్

Shamim: వివేకా హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వివేకా రెండో భార్య షమీమ్.. సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాతో పరిచయం మొదలుకుని ఆయన చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో షమీం ప్రస్తావించారు. వివేకాతో తనకు రెండు సార్లు పెళ్లి జరిగిందని తెలిపారు షమీమ్. తమ పెళ్లి వివేకా కుటుంబానికి ఇష్టం లేదని సీబీఐకి తెలిపారు. 2010లో ఒకసారి.. 2011లో మరోసారి వివాహమైందని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. 2015లో తమకు ఓ కుమారుడు జన్మించాడని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు షమీమ్.

తన కుమారుడి పేరుతో వివేకా భూమి కొనాలని అనుకున్నారని, అయితే భూమి కొనకుండా శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారని షమీమ్ తెలిపారు. చెక్ పవర్ తొలగించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు పడ్డారన్నారు. వివేకా ఆస్తిపై సునీతా భర్త రాజశేఖర్‌కు.. పదవిపై శివ ప్రకాష్‌కు కాంక్ష ఉండేదన్నారు. శివ ప్రకాశ్‌రెడ్డి తనను చాలాసార్లు బెదిరించారని..వివేకాకు దూరంగా ఉండాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి కూడా హెచ్చరించారని షమీమ్ వెల్లడించారు.

ఇక హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని షమీం వెల్లడించారు. బెంగళూరు సెటిల్‌మెంట్‌తో 8 కోట్లు వస్తాయన్నారని తెలిపారు. వివేకా చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లాలని ఉన్నా..శివప్రకాశ్‌రెడ్డిపై భయంతోనే వెళ్లలేకపోయానని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు షమీమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories