YS Sunitha: మా కుటుంబానికి ప్రాణహాని ఉంది.. ఓ వ్యక్తి తన ఇంటి చుట్టూ..

YS Sunitha: కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు వైఎస్‌ సునీత లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2021 4:40 PM IST
YS Viveka’s Daughter Sunitha Seeks Police Protection
X

YS Sunitha: మా కుటుంబానికి ప్రాణహాని ఉంది.. ఓ వ్యక్తి తన ఇంటి చుట్టూ..

YS Sunitha: కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు వైఎస్‌ సునీత లేఖ రాశారు. వివేకా హత్య కేసు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని లేఖలో తెలిపారు. ఆగస్టు 10న ఓ వ్యక్తి తమ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడని, ఆ వ్యక్తిని మణికంఠగా గుర్తించామని వైఎస్‌ సునీత లేఖలో వివరించారు. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలో మణికంఠ ఫోటో ఉందని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి మణికంఠ అనుచరుడంటూ లేఖలో పేర్కొన్నారు. గత నెల 12న సీఐకి ఫిర్యాదు చేశామని, రెక్కీ వెనుక వాస్తవాన్ని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పాత్రపై నిగ్గు తేల్చాలని కోరారు. ఇవాళ సీబీఐ ఎదుట విచారణకు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story