వీడిన వివేకా హత్య కేసు మిస్టరీ.. సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి

YS Vivekananda Reddy: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 9:50 PM IST
YS Vivekananda Reddy Murder Mystery Solved
X

వీడిన వివేకా హత్య కేసు మిస్టరీ.. సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి

YS Vivekananda Reddy: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా బాబుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. స్టేట్‌మెంట్‌లో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వివేకా హత్యలో నలుగురు పాల్గొన్నట్లు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి హత్య చేసినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు దస్తగిరి. బెంగుళూరులోని స్థల వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మోసం చేశారంటూ మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. దీనిపై అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story