YS Sunitha: మాకు ప్రాణహాని వుంది..రక్షణ కల్పించండి

YS Sunitha: పులివెందులలో తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కడప జిల్లా ఎస్పీని కోరారు సునీత.

Kranthi
Published on: 16 Jun 2021 9:26 AM IST
YS Vivekananda Reddy Daughter Sunitha Meets Kadapa SP
X

YS Vivekananda Reddy Daughter Sunitha:(File Image)

YS Sunitha: పులివెందులలో తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని, అందువల్ల భద్రత కల్పించాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీని కోరారు. వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసిన సునీత... పులివెందులలోని తన ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలని కోరారు. పులివెందులలో తనకు, తన కుటుంబసభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల భద్రత కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

సునీత విన్నపంపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎస్పీ కార్యాలయం నుంచి బయటికి వచ్చాక విలేకరులు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె పట్టించుకోకుండా కారెక్కి వెళ్లిపోయారు. ఆమెతో పాటు గన్‌మెన్‌ మాత్రమే వచ్చారు. 2019, మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లయినా ఆయన హత్య కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై సునీత అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్న రాష్ట్రానికి సీఎం అయి వుండి కూడా తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణ నత్తనడకన సాగడం పై సునీత మండిపడుతోంది.

Kranthi

Kranthi

Next Story